
ఆస్తులు కాదు, చదువు సంస్కారం ఇవ్వండి
ఒక సమయంలో 104 స్కూళ్ళ నిర్మాణానికి లయన్స్ క్లబ్బులు అంగీకరించాయి. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో, సొంత నిధులు వెచ్చించి స్కూళ్ళో నిర్మించారు విజయ్ కుమార్. హైదరాబాద్ బోరబండ మురికివాడలో పాతిక లక్షలతో స్కూలు భవనం నిర్మించారు. ఆ తర్వాత జన్మభూమి పథకం కింద 70-30 భాగస్వామ్యంతో ఆయన తన సొంత నిధులు వెచ్చించి 34 స్కూళ్ళు నిర్మించారు. వీటి నిర్మాణం కోసం ఆయన కృష్ణా జిల్లాలో, కోట్లాది రూపాయలు విలువ చేసే పంట పొలాలను విక్రయించారు. “అన్నదానం నిలిచేది ఐదు గంటలే, విద్యాదానం మనిషి జీవితానికి శాశ్వతంగా స్థిరత్వాన్ని చేకూరుస్తుంది” అంటూ తన తండ్రి చెప్పిన మార్గాన్ని ఆచరిస్తూ స్వలాభాపేక్ష లేకుండా. పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు విజయ్ కుమార్.
బుద్దిమాంధ్యులకు ప్రత్యేక హాస్పిటల్ : బుద్దిమాంధ్యుల కోసం 2008 లో 35 లక్షల రూపాయల వ్యయంతో ఒక హాస్పటల్ ఏర్పాటు చేశారు విజయ్ కుమార్. నీలోఫర్ ఇందుకు సహకరిస్తోంది. ఏటా 500 మందికి ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది క్యూర్ అయ్యి నిత్యజీవిత కార్యక్రమాలను తమంతట తాముగా చేసుకోగలుగుతున్నారు. బుద్దిమాంధ్యులైన పిల్లలకు నుర్సులే ఇళ్లకు వెళ్లి నిత్య జీవిత కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక మహత్తర కార్యంగా కెరీర్ బెస్ట్ మైల్ స్టోన్ సర్వీస్ గ ఆయనకు సంతృప్తినిచ్చింది.

ఎమ్మెల్యే పదవికి తిరస్కృతి: ఎన్టీ రామారావు 1994లో డాక్టర్ విజయ్ కుమార్ ను జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే, ఏకపక్షంగా ఉండాల్సి వస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ నిష్పక్షపాతంగా సేవలు అందించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని డాక్టర్ విజయకుమార్ ఆనాడు సున్నితంగా తిరస్కరించారు.
లయన్స్ గవర్నర్గా విశిష్ట సేవ: డాక్టర్ విజయకుమార్ 1989లో లయనిజంలో చేరి వైస్ ప్రెసిడెంట్ గా, జోన్ చైర్మన్, రీజియన్ చైర్మన్, గ్రూప్ కోఆర్డినేటర్, వైస్ గవర్నర్, మహబూబ్నగర్ జిల్లా లయన్స్ గవర్నర్గా విశిష్ట సేవలు అందించారు. విజయకుమార్ 1996-97 లో లయన్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టగానే, మెహబూబ్ నగర్, మెదక్, బోధన్, రామాయంపేట, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పేదల సేవ కోసం అంబులెన్స్ లు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ అవి విజయవంతంగా పనిచేస్తున్నాయి.
గవర్నర్ తమిళసై ప్రశంస : గత ఏడాది మహబూబ్ నగర్ లో రెడ్ క్రాస్ వారి బ్లడ్ బ్యాంక్ భవంతి నిర్మించారు విజయకుమార్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయన దాతృత్వాన్ని ఎంతగానో ప్రశంసించి స్వర్ణ పథకంతో ఆయనను ఘనంగా సత్కరించారు. తొలుత ఆయన లయన్స్ గవర్నర్గా ఉండగా, ఒకే రోజు 325 మందికి కంటి చికిత్సలు చేయించారు. 1997లో రక్తదాన శిబిరం ద్వారా 20 వేల యూనిట్ల రక్తాన్ని ఒకేరోజు సేకరించారు. ఈ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి.
కళా సాంస్కృతి రంగ సేవ: హైదరాబాదులో నాలుగేళ్లుగా కళా సాంస్కృతిక రంగాలకు సేవలు అందిస్తున్నారు విజయ్ కుమార్. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు, కళాకారుల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ఆయన చేతులమీదుగా సుమారు 70-80 సాంస్కృతిక సంస్థలు ఆవిర్భవించాయి. అదేవిధంగా, త్యాగరాయ గాన సభామండపంలో సంగీత, సాహిత్య, కళారంగాలలో ప్రముఖులైన కళాఖండాలను విజయకుమార్ శాశ్వత ప్రతిపాదికపై ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రకారుడు నాగేశ్వరరావు ఈ కళాఖండాలను చిత్రించారు. 50 ఏళ్ళు పాటు ఈ పెయింటింగ్స్ ఊడిపోతాయి. వీటిల్లో త్యాగరాజు, ఘంటసాల, సహా ఎంతో మంది ప్రముఖ వాగ్గేయకారులు, సాహిత్యవేత్తలు, భారతరత్న పురస్కార గ్రహీతల చిత్రాలు, తెలుగు తేజోమూర్తుల పెయింటింగులు నిత్యం ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్నాయి.
సమాజానికి ఇచ్చిందే అసలైన ఆస్తి: “మనం సంపాదించిన ఆస్తి ఎంతో మన కుటుంబం సభ్యులకు తప్ప ఇతరులకు తెలియదు. అదే ఆస్తికి సేవ రూపాన్ని ఇవ్వగలిగితే, ప్రజలందరికీ చెందుతుంది. అలా సమాజ ప్రయోజనాల కోసం ఏదైతే మనం ఇచ్చామో అదే మన అసలైన ఆస్తి. అదే చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది” అన్నారు విజయ్ కుమార్. తన సిబ్బంది పిల్లలు సహా, పేద విద్యార్థుల చదువులకు అయినా ఆయన సహకరిస్తున్నారు. అనేక పేద, అనాధ, దివ్యాంగుల సంస్థలకు అండదండలిస్తున్నారాయన. అన్నారంలోని వృద్ధాశ్రమం నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు. రచయిత, దర్శకుడు సూర్యచంద్ర సారిద్యంలో 300 మంది పిల్లలతో నిర్మించే “బాల గోవిందం” చిత్రాన్ని కూడా ఆయన సమర్పిస్తున్నారు.
ఆస్తులు కాదు, చదువు సంస్కారం ఇవ్వండి: నేటి సమాజ తీరుతెన్నుల పట్ల విజయ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “సమాజంలో మంచితనం పెరగాలంటే తల్లిదండ్రులు మారాలి. పిల్లలకు తల్లితండ్రులు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. చదువు సంస్కారం. ఈ రెండు ఉంటే నిర్భయ, దిశ లాంటి కేసులు ఉండవు. అలాంటి పిచ్చి పనులు ఎవరు చేయరు సమాజ మార్పు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంది. అందుకే తల్లిదండ్రులు సమాజం గురించి ఆలోచించండి. పిల్లల్ని ఇంటర్నెట్ ముందు కాదు, ఫుట్ బాల్, వాలీబాల్ నెట్ ముందు నిలబెట్టి ఆటలు ఆడించండి. లైబ్రరీలు దుమ్ముకొట్టుకుపోకుండా కాపాడుకోవాలంటే, పిల్లల్ని గ్రంధాలయాలకు పంపించండి. వారిలో పుస్తక జ్ఞానం పెంపొందించండి.” అని విజ్ఞప్తి చేశారు విజయ్ కుమార్.
కుటుంభం : విజయ్ కుమార్ 1977లో వివాహం చేసుకున్నారు. ఆయన సతీమణి కృష్ణకుమారి. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి పూర్న కుమర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు కోడలు శ్రీదేవి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరు మనవరాలు తన్వి రెండో అబ్బాయి అమిత్ కుమార్ అమెరికాలో ఎమ్మెస్ చేశారు. మెకానికల్ ఇంజనీరు కోడలు డాక్టర్ ప్రణీత డెంటిస్ట్ మనవడు సాత్విక్ డల్లాస్ లో స్థిరపడ్డారు. మూడో అబ్బాయి సుమిత్ కుమార్ కంప్యూటర్లో ఎంఎస్ చేసి హోస్ట్ న్ లో స్థిరపడ్డారు. హోస్ట్ న్ ఇండియన్ నేషనల్ ఐటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. కోడలు రీనా అనుపమ డబల్ ఎంబీఏ చేసి మేనేజర్ గా పనిచేస్తున్నారు మనవరాలు శ్లోక.
Provide Education, Not Wealth to the coming generations
Vijay Kumar funded the construction of 34 schools in Krishna district, Andhra Pradesh, using his own resources after a Lions Club project to build 104 school buildings faced difficulties. He sold agricultural lands and crops to finance these schools, emphasizing the enduring impact of education on children’s lives. His dedication to providing education to underprivileged children echoes his father’s belief, and he has earned immense respect and gratitude from the local communities for his contributions to education.
Special Hospital for Individuals with Intellectual Disabilities: In 2008, Vijay Kumar established a specialized hospital named as Neelofar for the intellectually challenged with an expenditure of 35 lakhs . This hospital provides medical services to around 500 individuals, ensuring their daily well-being. Vijay Kumar and his team also educate intellectually challenged children in their homes, making a significant impact on their lives. This endeavor has been a career-best milestone for him, bringing immense satisfaction and fulfillment.
In 1994, NT Rama Rao appointed Dr. Vijay Kumar as a nominated member of the Jadcharla Municipal Council. However, when NTR’s party offered him a position as a representative, he declined, citing his commitment to providing impartial service to all people beyond party lines as his primary goal. This act of rejecting a political appointment in favor of non-partisan service reflects Dr. Vijay Kumar’s dedication to serving the community with integrity.
Special Services as Lions Governor: Dr. Vijay Kumar joined Lions Clubs International in 1989 and held numerous leadership positions, including Vice President, Zone Chairman, Region Chairman, Group Coordinator, Vice Governor, and Governor for the Mahabubnagar district. In 1996-97, he served as District Governor and provided ambulances to several regions. His dedication to service continues today.
Governor Tamilisai Praises: Governor Tamilisai highly praised Dr. Vijay Kumar for establishing the Red Cross Blood Bank in Mahabubnagar. When he served as District Governor for Lions Clubs International, he organized medical camps, treating 325 people in a single day. In 1997, through a blood donation camp, he collected 20 units of blood in a single day, and his commitment to such service continues.
Service in the Field of Arts and Culture: Dr. Vijay Kumar is a stalwart supporter of Hyderabad’s cultural and artistic community, having nurtured around 70-80 cultural organizations. He sponsors various cultural events and artists, including painters like Nagashwararao, who have created timeless portraits of eminent figures in music, literature, and the arts. His dedication to preserving and promoting cultural heritage remains unwavering even after 50 years, making him a cherished patron of the arts.
The True Wealth That Serves Society: Dr. Vijay Kumar values service to society as the truest form of wealth, emphasizing that dedicating resources for the betterment of society is enduring wealth residing in people’s hearts for generations. He extends this philosophy to his family, supporting various educational initiatives for children, including those with special needs, and committing to elderly care. He has also collaborated with filmmaker Suryachandra Sardhyam to create the film “Balagovindam” involving 300 children, showcasing his passion for nurturing talent and serving society.
Provide Education, Not Wealth: Today, Vijay Kumar emphasized the importance of education and cultural values over material wealth for societal progress. He urged parents to focus on providing education and moral values to their children, highlighting that these are the true assets that can address various social issues.
Family: Vijay Kumar married Sathimani Krishna Kumari in 1977 and has three children. His eldest son, Purna Kumar, is a software engineer, and his second son, Amit Kumar, is an Assistant Engineer in the Panchayat Raj department. His youngest son, Sumit Kumar, holds a Ph.D. in mechanical engineering and works as a computer engineer in the USA. His daughter, Reena Anupam Dabbala, is an MBA graduate and works as a manager. The Manavaralu family has members well-established in various professions.