
నూతన లక్ష్యాలతో పేదలకు స్వచ్ఛంద సేవలు
పేదరికం, దారిద్ర్య నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నాయి. ఈ విషయంలో పేదలకు తన వంతుగా వారిని ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ విశ్వవ్యాప్తంగా సేవలను అందిస్తోంది. 1917 లో మెల్విన్ జోక్స్ అనే వ్యక్తి లయన్స్ క్లబ్ ను ప్రారంభించారు. మన రాష్ట్రంలో 47 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సేవలందిస్తోంది లయన్స్ క్లబ్. 1956 లో హైదరాబాద్ లో తన శాఖను ప్రారంభించింది. లయన్స్ క్లబ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నూతన గవర్నర్గా లయన్ ఏ విజయ్ కుమార్ జూలై 2న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా న్యూస్ టుడె ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ వివరాలు:
ప్రశ్న: లయన్స్ క్లబ్ ఆశయాలు ఆదర్శాల గురించి వివరిస్తారా
జవాబు: తప్పకుండా! స్వేచ్ఛ, విజ్ఞానం, దేశ పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పిన సంస్థ ఇది. నిరుపేదలకు సేవ చేయడం కోసమే పుట్టిన సంస్థ ఇది. నిస్సహాయులుగా గుర్తించిన వారందరికీ 100 శాతం ఉచితంగా సేవ చేయడమే లయన్స్ లక్ష్యం. అయితే సరైన ప్రచారం అవగాహన ప్రజలలో లేక క్లబ్ సేవలను అంతగా ఉపయోగించుకోవడం లేదు.
ప్రశ్న: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో మీ మీరు జరుపుతున్న సేవా కార్యక్రమాలు ఏమిటి
జవాబు: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కింద అదిలాబాద్ సగభాగం, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి సగభాగం, హైదరాబాద్, మహబూబ్ నగర్ వస్తాయి. దీన్ని మేము c2 గా గుర్తిస్తాం. కర్ణాటకలోని రాయచూర్, బీదర్ లు కూడా సి2 పరిధిలోకే వస్తాయి. ఈ పరిధిలో 74 క్లబ్బులు, 2780 మంది సభ్యులు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. సంస్థ ప్రధాన ఆశయమైన నేత్రదానం కార్యక్రమాన్ని సి2 విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఎన్నో ప్రజోపయోగకరమైన సంస్థలను క్లబ్బు ఏర్పాటు చేసింది. వాటిలో నిజాం క్యాన్సర్ హాస్పిటల్ లో ఆంకాలజీ బ్లాక్ లో సి2 ద్వారా వెళ్లిన నిరుపేదలకు దాదాపు ఉచిత వైద్యం లభిస్తుంది. అలాగే నేత్ర సంబంధమైన ఎటువంటి వ్యాధులకు అయినా, ఉచిత చికిత్స చేసి ఆదుకోవడానికి దోమలగూడలోని సాధురం ఐ హాస్పిటల్, సికింద్రాబాద్ లొ లయన్స్ నార్త్ ఐ హాస్పిటల్, మహబూబ్ నగర్ లోని రామిరెడ్డి మెమోరియల్ ఐ హాస్పిటల్ సిద్ధంగా ఉన్నాయి. అలాగే రెండు బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తోంది. లయన్స్ మాతా దిన్ గోయల్ బ్లడ్ బ్యాంక్, లయన్స్ బాంజి కే రాజ్ బ్లడ్ బ్యాంక్ లు డబ్బు పెట్టి కొనలేని వారికి రక్తాన్ని ఉచితంగా సరఫరా చేస్తాయి. అంతేకాకుండా 25% రేట్లతో పథలాజికల్ ల్యాబ్ సౌకర్యాన్ని కోటిలో ఏప్రిల్ 6 న ప్రారంభించాము. అంతేకాదు, గ్రామాల దత్తత, బస్సు స్టాపుల నిర్మాణం, నేత్ర వైద్య, దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజా జీవితానికి అత్యంత సన్నిహితంగా మొదలుతున్నాను.

ప్రశ్న: ఇంతవరకు మీరు సాధించిన విజయాలు ఏమిటి
జవాబు: అత్యంత క్రమశిక్షణతో, అంకితభావం, సేవాభావంతో మేము చేస్తున్న ప్రతి పని ఘనవిజయాలను సాధిస్తుంది. ఓ వ్యక్తి గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్ష రూపాయలపై మాటే. అదే లయన్స్ క్లబ్ ద్వారా ఓ నిరుపేద ఆ చికిత్సను పూర్తిగా ఉచితంగా చేయించుకునేలా ఏర్పాట్లు చేశాం. ప్రతి సంవత్సరం దాదాపు 100 నేత్రాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తున్నాం. ఈ సంవత్సరం 200 నేత్రాల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రజలను మేము కోరేది ఒక్కటే, మా సేవలను తెలుసుకోండి. వాటిని పూర్తిగా ఉపయోగించుకోండి. 24 గంటలు మీ సేవలో నిమగ్నమై ఉన్నామని గమనించండి .
ప్రశ్న: 1996-97 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్గా ఉన్న మీరు 1997-98 సంవత్సరానికి గవర్నర్గా మీ లక్ష్యాలు, ఆశయాలు ఏమిటి
జవాబు: నేను గవర్నర్గా నూతన లక్ష్యాలు, ఆశయాలను ఏర్పరచుకుని అవి సాధించడానికి, అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నాను. సాధారణ లక్ష్యాలతో పాటు ఫ్యామిలీ కేర్ పేరుతో కొన్ని నూతన లక్ష్యాలను ఏర్పరచుకున్నాను. వాటిలో సంవత్సరానికి 15 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం, ప్రతి రెవెన్యూ డిస్ట్రిక్ట్ కు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం, మానసిక వికలాంగులైన పిల్లల కోసం కొన్ని ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల అమలు, క్లబ్ సభ్యుల కోసం 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం, 15 వేల యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంగా ఉన్నాయి. ప్రతి రెవెన్యూ జిల్లాకు ఒక బ్లడ్ బ్యాంకు ఏర్పాటు, నగర పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి. గుండె ఆపరేషన్ల నిర్వహణ, ముఖ్యంగా వీధి బాలలను చేరదీసి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసి విద్య, సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య తదితర సదుపాయాలు కల్పన ఉన్నాయి. ‘బెగ్గర్ ఫ్రీ జోన్’ ఏర్పాటుకు కృషి చేయడం, కళ్ళ దానాన్ని ప్రోత్సహించడం, ఐ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఉంది. ఐ బ్యాంకుల ఏర్పాటు, కంటి ఆసుపత్రుల నిర్మాణం అంతేకాకుండా 20 వేల కాట్రాక్ట్ ఆపరేషన్లు, వేయి ఐ.ఓ.ఎల్ ఆపరేషన్లు చేయడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాను. అంతేకాకుండా వాతావరణ సమతుల్యాన్ని కాపాడటానికి లక్ష మొక్కలు నాటడానికి నిర్ణయించుకున్నాం. మా వినాదం సేవ. 1987-89 లో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న లయన్ ఏ విజయ్ కుమార్ అనంతకాలంలో ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్గా, రీజియన్ చైర్మన్గా, వైస్ గవర్నర్గా, ఎన్నో అవార్డులు గెలుపొందారు.
Voluntary services to the poor with new goals Dedicated Volunteer Service with Fresh Goals for the Less Fortunate
No matter how many schemes the governments undertake to eradicate poverty, they are unable to achieve the intended goals. In this regard, the Lions Club is serving the poor worldwide to do its bit to help them. In 1917, a man named Melvin Jokes started the Lions Club. Lions Club has been doing voluntary service in our state for 47 years. It started its branch in Hyderabad in 1956. Lion A Vijay Kumar will be sworn in as the new Governor of Lions Club Hyderabad District on July 2 in Philadelphia, USA. News Today interviewed him on this occasion. Interview Details:
Question: Can you explain the objectives of Lions Club and its ideals?
Answer: Absolutely! The Lions Club is an organization driven by the principles of freedom, knowledge, and national security. It is an institution born with the purpose of serving the less fortunate. The primary goal of Lions Club is to engage 100% of willing volunteers in providing service for those in need. Effective promotion and awareness among the public, rather than exploiting club services extensively, is what the Lions Club focuses on.
Question: What are the service programs you are conducting in Hyderabad District?
Answer: In the Hyderabad District, which includes parts of Adilabad, Nizamabad, Medak, Rangareddy, Hyderabad, and Mahbubnagar, as well as parts of Raichur and Bidar in Karnataka within the C2 boundary, there are 74 clubs and 2780 members dedicatedly engaged in community service. The main focus of the organization, Lions Club International District 320C2, is conducting eye care programs. The districts you’ve mentioned encompass regions like Adilabad, Nizamabad, Medak, and Rangareddy in Telangana and Raichur and Bidar in Karnataka.
These service initiatives are extensive and diverse, aiming to benefit society and improve lives. The programs include eye donation, free medical camps, providing free education, promoting women’s health, offering free medical care for eye ailments and other health issues, establishing blood banks, and conducting dental and eye care camps. Additionally, there is a strong emphasis on charitable initiatives such as providing free spectacles, constructing bus stops, organizing medical and dental camps, and contributing to various community welfare projects. All these endeavors are aimed at making a significant impact on the lives of people in need.
The organization has successfully established prominent eye hospitals like the Nizam’s Cancer Hospital’s Ophthalmology Block, Lions North Eye Hospital at Secunderabad, and Ramireddy Memorial Lions Eye Hospital at Mahabubnagar, where essential medical care is provided to patients. Moreover, two blood banks have been set up, namely, Goel Blood Bank on Lions Maternal Day and Raj Blood Bank on Lions Banji Kishan Rao Blood Bank Day. They facilitate blood donation for those in critical need. Furthermore, with a 25% discount, the Lions Pathological Lab Services have been inaugurated to provide affordable medical testing and diagnostic services. In addition to these initiatives, the organization conducts dental and eye care camps, offers ophthalmic and dental care in remote areas, builds bus stops, and provides medical and dental facilities to underserved communities, all contributing to the betterment of society.
Question: What are the achievements you have accomplished so far?
Answer: With a systematic approach, determination, and a service-oriented mindset, we have achieved significant successes in every endeavor we undertake. Performing a surgery on someone’s eye would cost around a lakh of rupees, but through the efforts of Lions Club, we have been able to provide that same operation for free. Every year, we collect funds and resources to facilitate eye surgeries for those in need.
The Lions Club plans and organizes these surgeries to ensure they are conducted completely free of charge. We aim to gather around 100 corneas annually to meet the urgent needs of individuals. This year, our goal is to procure corneas from 200 donors. Our intention is singular – to help people. We want you to be aware of our services and use them as needed. Please utilize these services to the fullest extent possible. Remember that we are available for your service 24/7.
Question: You served as the District Vice Governor for the year 1996-97. What were your goals and objectives when you served as the Governor for the year 1997-98?
Answer: As the District Vice Governor for the year 1996-97, I worked with great enthusiasm to set new goals and objectives. Moving beyond regular goals, I introduced new ones related to Family Care Projects. Some of the key initiatives included performing 15 family planning surgeries per year, providing an ambulance to each revenue district, organizing special programs for mentally challenged children, implementing a special insurance program of 2 lakh rupees for club members, focusing on collecting 15 units of blood per unit, and establishing a blood bank in every revenue district. Special efforts were made to conduct eye surgeries, improve the lives of street children, provide vocational and technical education, and organize ‘Beggar-Free Zones.’ We also promoted eye donation and established eye collection centers. We aimed to provide quality education, encourage technological education, and enhance vocational training.
I was involved in various activities such as cataract surgeries, traffic management, and providing all necessary items to the victims of cleft surgeries. Additionally, I initiated the construction of canteens for visually impaired children, encouraged eye donation, and set up AI. I focused on providing special health services to destitute children and launched tree plantation drives to maintain environmental balance. As a token of our service, we contributed to the society. Mr. Vijay Kumar, who was the District Vice President in 1987-89, continued his journey with remarkable success. He held positions as President, Zone Chairman, District Chairman, Region Chairman, and Vice Governor, winning numerous awards along the way.