
రియల్ లయన్ విజయ్ కుమార్
జీవితం అంటేనే కష్టం + సుఖం. రెండోది ఎదురైనప్పుడు పొంగిపోవడం మానవ నైజం. అదే మొదటిది కుంగిపోయేలా చేస్తుంది. దీనికి ఎవరు అతీతులు కాదు. కాకపోతే పట్టుదల అంకితభావంతో పాటు ఒక లక్ష్యంతో పయనించేవారు చాలావరకు వీటిని అధిగమిస్తుంటారు. ఇలాంటివారు సహజంగా సామాజిక సేవలోనూ ముందుంటారు. తమ సామర్థ్యం, చేయగలిగిన సత్తా వారిని తమ సమస్యలనే కాదు ఎదుటివారిని సైతం తీర్చేలా చేస్తూ ఉంటుంది. ఇలాంటి వారు గెలుపునే కోరుకుంటారు. ఆ దిశగానే అడుగులు వేస్తుంటారు. వారిలో ఉండే విల్ పవర్ తమనే కాదు… తన చుట్టూ ఉన్న పదిమందిని ఆదుకొని సొంతన చేకూరుస్తూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు లయన్స్ క్లబ్లో 324 సి 2 డిస్ట్రిక్ట్ గవర్నర్గా పనిచేసిన అరికపూడి విజయ్ కుమార్. లయన్స్ క్లబ్ అంటేనే సామాజిక సేవ నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా అందులో హోదా కోసం చేరితే ఆ విధంగా తమ పనులు చక్కబెట్టుకునేవారు కనిపిస్తుంటారు లయన్స్ అందరూ విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే.. సమాధానం చెప్పడం కష్టమే. ఇందులో చేరే వారికి తప్పకుండా పైన చెప్పిన లక్షణాలు ఉండాలి. అప్పుడే వారు రియల్ గా మనగలుగుతారు. తన సుదీర్ఘ కెరీర్లో విజయ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. విరాళాలు సేకరించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఎత్తైతే, తనకున్న ఆస్తులను సైతం కొంత ఇలాంటి వాటికోసం అందించడం మరో ఎత్తు. ఇలా చేసేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందులో విజయకుమార్ ఒకరు.
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో అరికపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మలది ఉన్నత కుటుంబం. రైతు కుటుంబానికి చెందిన పూర్ణచంద్రరావు ఎదుటివాడు కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకునేవారు. ఎవరికీ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా తన వంతు ముందుగానే అందించేవారు. ఏ సమాజం తన ఉన్నతికి తోడ్పడిందో.. అదే సమాజానికి కొంత కేటాయించడం కనీస ధర్మం అనుకునేవారు ఆయన. అదే సేవా దృక్పథం కుమారుడు విజయకుమార్ కు అలబడింది. ఈ దాతృత్వంలోనే ఆయన లయన్స్ క్లబ్ పట్ల ఆకర్షితులయ్యారు. లయన్స్ క్లబ్లో ఒక సభ్యుడిగా చేరి డిస్ట్రిక్ట్ గవర్నర్ స్థాయికి ఎదగటం అంటే ఎంతో శ్రమించాలి. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. తన అద్వితీయ సేవలతో విజయ్ కుమార్ సొంత ఇంటి పనుల కంటే కూడా లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లోని ఎక్కువ లీనమై పని చేసేవారు. రక్తదాన శిబిరాలు, ఉచిత నేత్ర పరీక్షలు, ప్రతిభావంతులైన బీద విద్యార్థులకు ఆర్థిక సాయం, పుస్తకాలు..

బట్టలు పంపిణీ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందుండి తమ రీజియన్ తరపున దుప్పట్లు, ఆహార పొట్లాలు, మందులు లాంటివి అందించడం, గుండె జబ్బులతో బాధపడే వారికి ఆపరేషన్ చేయించడం, వికలాంగులకు కృత్రిమ అవయవాల ఏర్పాటుకు తగిన సాయం, వారికి వీల్ చైర్లు లాంటివి పంపిణీ లాంటివి ఎన్నో నిర్వహించారు. అయితే ఆయన లైన్స్ క్లబ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హైలెట్స్ ఏమిటంటే 1990లో జడ్చర్లలో సరైన ఆసుపత్రి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడటం చూసి స్వయంగా తన తల్లితండ్రుల పేరిట ఒక హాస్పటల్ నిర్మించి అందించారు. ఇది ఈరోజున మరింత ఎదిగి లక్షలాది మందికి వైద్య సౌకర్యాలు అందిస్తుంది . అలాగే తమ ప్రాంతంలో పత్తి పండించే రైతులకు సరైన మార్కెట్ యార్డు లేక పండిన పంటలను దళారీలు పాలు లేదంటే కనీసం గిట్టుబాటు ధర రాని పరిస్థితితో ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన దుస్థితిని గమించి 20 ఎకరాలు భూమిని 2008 లో (ఆనాడు దీని విలువ రు 8 కోట్లు) మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఇచ్చేశారు. ఈ మార్కెట్ యార్డును ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి రైతులను ఆదుకున్న విజయ్ కుమార్ ను ఎంతగానో ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా మానసిక వైకల్యంతో బాధపడే పిల్లల పునరావాసం, చికిత్స కోసం రూ 35 లక్షల వ్యయంతో ప్రతిష్టకరమైన లయన్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను నీలోఫర్లో నిర్మించి ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో మానసిక వైకల్యానికి చికిత్స చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలు ఆసుపత్రి వరకు రాకుండానే వారి ఇంటి వద్దనే చికిత్స పొందడానికి వీలుగా నర్సులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకుగాను నర్సులకు కొంత సొమ్ము చెల్లిస్తే చాలు. ఈ శిక్షణ కారణంగా నర్సులకు ఇలా ఉద్యోగ అవకాశం ఏర్పడుతున్నది. పిల్లలను ఆస్పత్రి వరకు తీసుకొని రావడం ఖర్చు, శ్రమతో కూడిన పని అయినందున దీనికి రూపకల్పన చేసినట్లు విజయకుమార్ చెప్పారు. ఒకరోజున 324 మందికి కంటి చికిత్స చేయించడంతోపాటు 1997లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 20 వేల యూనిట్లకు పైగా రక్తం సేకరించి అందించడం తాను సాధించిన కొన్ని విజయాలుగా ఆయన చెప్పుకొచ్చారు. అవిశ్రాంతంగా ఇలా పలు సేవా కార్యక్రమాలు చేసిన లయన్ విజయకుమార్ ప్రస్తుతం ఇవ్వ లయన్స్ సభ్యులకు తన సలహాలు సూచనలు అందిస్తూ వారిని నడిపిస్తున్నారు. ఆయన అందించిన విశేష సేవలకు హలో హైదరాబాద్ అభినందనలు అందజేసింది.
The True Lion: Vijay Kumar’s Extraordinary Journey of Service
Life is an intricate blend of hardships and joys. Yet, the essence of being human lies in the second part – the resurgence after a setback. The first step might be a stumble, but it signifies the commencement of progress. This journey isn’t just for the heroes of antiquity; it’s a path open to anyone armed with determination and purpose. Many individuals have achieved remarkable success through unwavering commitment to their goals. These extraordinary individuals not only excel in their personal pursuits but also engage in philanthropy. They harness their talents and strength not just to overcome their own challenges but also to help others surmount theirs. These people chase victory and possess the capacity to attain it.
They wear the same cap – their unwavering determination isn’t solely for themselves; it extends to embrace those around them. Mr. Arikapudi Vijay Kumar, who served as the Governor of the 324 C2 District in the Lions Club, belongs to this category. The Lions Club is synonymous with community service, yet not all Lions uphold the principles of this noble organization with equal diligence. The embodiment of a true Lion is someone who unequivocally exhibits these qualities. Vijay Kumar, with his extensive record of service programs, is such an individual.
While some may contribute by organizing programs and collecting donations, only a handful offer their own assets for such causes. Vijay Kumar belongs to this select few. Hailing from an esteemed family in Jadcherla, Mahabubnagar district, Arikapudi Purnachandra Rao and Nancharamma exemplified generosity. Purnachandra Rao, hailing from a farming background, always extended a helping hand to those in need. If anyone required assistance, he provided it without hesitation. He believed that giving back to society, which had supported his ascent, was not just a duty but a privilege. They contributed to society to ensure that their prosperity translated into the prosperity of the community. Vijay Kumar has walked this path of service.
In his philanthropic journey, he was drawn to the Lions Club. Becoming a Lions Club member and rising to the position of District Governor is a testament to years of tireless effort, a privilege bestowed upon very few. Beyond his personal responsibilities, Vijay Kumar actively participates in various philanthropic activities within Lions Club programs. These include organizing blood donation camps, conducting free eye examinations, providing financial support to talented students, distributing books and uniforms, offering utensils, food, and beds during natural disasters, performing surgeries for head injuries, procuring prosthetic limbs for the physically challenged, and providing wheelchairs to those in need. Furthermore, he has orchestrated numerous initiatives, such as distributing clothes and food to the needy during natural calamities and extending educational and livelihood support to the underprivileged.
Vijay Kumar’s contributions to Lions Club programs have often exceeded his contributions to his own household. Yet, one hallmark of his Lions Club career stands out. In 1990, after witnessing the hardships faced by the people in Jadcherla, he built a hospital in honor of his parents. Today, this hospital has expanded its reach, providing medical services to millions. Furthermore, recognizing the plight of cotton farmers in his region, who lacked a proper market yard and were compelled to sell their crops to brokers at unfavorable prices, Vijay Kumar played a pivotal role. In 2008, he donated 20 acres of land (valued at Rs 8 crores at the time) for the construction of a market yard, an initiative appreciated by then-Chief Minister Y.S. Rajasekhara Reddy for its unwavering support to the farming community.
Similarly, a prestigious Lions Child Development Center, costing Rs 35 lakhs, was established at Niloufar for the rehabilitation and treatment of children with mental disabilities. In addition to providing treatment for mental disabilities, this facility also trains nurses to administer care to such children in rural areas, ensuring they can receive treatment at home. This not only aids the children but also generates employment opportunities for nurses. Vijay Kumar conceived this initiative to eliminate the costs and challenges associated with transporting children to and from the hospital. His accomplishments include conducting eye treatments for 324 people in a single day and organizing blood donation camps in 1997, resulting in the collection and distribution of over 20 thousand units of blood.
Currently, Lion Vijay Kumar continues to provide invaluable guidance and recommendations to Lions Club members. ‘Hello Hyderabad’ extends its heartfelt congratulations to him for his exceptional contributions. His selfless dedication has garnered him numerous accolades, recognizing his outstanding service.”