
మానసిక వికలాంగులకు శిక్షణ కేంద్రము
వికలాంగుల చికిత్సల కోసం ఎన్నో అస్పత్రులున్నాయి. కాలుపోతే కట్టుడు కాలును అమర్చే సౌలభ్యం కూడా ఉంది. కానీ బుద్ధిమాంద్యతతో జన్మించిన పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా తీర్చిదిద్దటానికి తగిన ఆసుపత్రులు లేవు. బుద్ధి మాంద్యంతో బాధపడే పిల్లలను చేర్చుకునే ఆస్పత్రులు ఉన్నాయేమో గానీ వారిని తీర్చిదిద్దే పని చేపట్టిన ఆసుపత్రులేవీ లేవు ఆసుపత్రిలో చేర్పిస్తే కొందరిని మాత్రమే చేర్చవచ్చు.
చేర్చినా వారం రోజులు లేదంటే మరో 15 రోజులు ఉంచుకుని పంపిస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పిల్లలకు ఒక శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలని ఈ ఆస్పత్రికి రూపకల్పన చేసాం. ఈ ఆసుపత్రిలో పిల్లలను చేర్చుకోవడమే కాదు పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు నర్సులను ముందుగా శిక్షణ ఇవ్వడం ద్వారా తీర్చిదిద్దుతారు. వీరు బుద్ధి మాన్యతతో బాధపడే పిల్లలు ఉండే గ్రామాలకు సైతం వెళ్లి శిక్షణ ఇస్తారు. దీనివల్ల దూర ప్రదేశాలనుంచి అస్పత్రులకు రావాల్సిన అవసరం లేదు. కేవలం నర్సులను తమ వద్దకే తీసుకొని వెళ్లొచ్చు.
ఇందుకుగాను ఆ నర్సులు (శిక్షణ తీసుకునేవారు పురుషులు కూడా ఉన్నారు) వారి నుంచి కొంత ఛార్జీ చేస్తారు. ఈ రకంగా వారికి ఒక ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. పిల్లలకు ఇబ్బంది తప్పుతుందని భావించి దీనికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఇందుకు గాను మూడు అంతస్తుల తో ప్రత్యేక భవనాన్ని నిర్మాణం చేశారు. దీని నిర్మాణానికి స్థలాన్ని సంపాదించుకోవడం కూడా ఒక యజ్ఞమే చేశానన్నారు. ఇలాంటి ఆలోచన రాగానే, ఒక అస్పత్రి నిర్మించదలిచచాం. అందుకు తగిన స్థలం ఇమ్మని కోరినప్పుడు స్థలం ఇవ్వడానికి అభ్యంతరం లేదు గానీ…
ఓ 35 స్కూల్స్ కట్టి ఇవ్వరాదా ? అంటూ ఒక చిన్న మెలిక పెట్టడంతో, ఆస్పత్రి నిర్మించాలనే పట్టుదలతో కష్టపడి ఆ స్కూల్స్ కట్టించి ఇచ్చామని విజయకుమార్ చెప్పారు. దీనికి ముందు ఆయన జడ్చర్లలో 1990 లోనే తన తల్లితండ్రుల పేరిట ఒక ఆస్పత్రి సైతం కట్టించి ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఆస్పత్రిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆపై జడ్చర్ల లోనే పత్తి రైతులు పడే కష్టాలు, ఇబ్బందులను గమనించి మార్కెట్ యార్డు నిర్మాణానికి సొంత స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. తన తండ్రి ఆరిగపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మల పేరు మీదుగా ఆయన ఈ మార్కెట్ యార్డును ఇవ్వగా వారి విగ్రహాలను వైఎస్ ఇటీవల ఆవిష్కరించారు ఈ మార్కెట్ యార్డు ఏర్పర్చిన పత్తి రైతులు అక్కడే అమ్ముకునే సౌలభ్యం కలిగింది. ఈ మార్కెట్ సౌలభ్యం మహబూనగర్ జిల్లాకే పరిమితం కాకుండా చుట్టుపక్కల పలు ప్రాంతాలకు కలిసి రావడం చూస్తుంటే విజయ్ కుమార్ ఇచ్చిన స్థలం వేలాదిమందికి ఏ రకమైన మేలు కలిగిస్తున్నదో స్పష్టంచేస్తున్నది.
లయన్స్ క్లబ్ డిస్త్రిక్ట్ గవర్నరుగా పనిచేసి పలు పాఠశాలలు, బస్ షెల్టర్లు, ఆసుపత్రులు వాటికి అంబులెన్స్ సౌకర్యాలు సమకూర్చిన ఘనత ఆయనది. ఒకేరోజున 324 మందికి కంటిచికిత్సలు చేయించడంతోపాటు 1997లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 20 వేల యూనిట్ల రక్తం ఒకే రోజులో సేకరించిన విజయ్ కుమార్ సేవా కార్యక్రమాలు అవిశ్రాంతంగా సాగుతూ ఉన్నాయి. వైయస్ మాటలు చెప్పడం లేదు… చేతల్లో చూపిస్తున్నారు అదే ఆయనలో బాగా నచ్చింది అనుకున్నది మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నారు. హామీలకే పరిమితం కాకుండా వాటిని కార్యరూపంలోకి తీసుకొని వస్తున్నారు. 24 గంటలు ప్రజలకు ఏ రకంగా దగ్గర ఉందాం అని ఆలోచించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
కాబట్టి ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ చక్కటి పురోభివృద్ధి సాధించిందని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను రైతులందరూ పంటలు పండి సంతృప్తిగా ఉన్నారు తప్పితే ఆకలి అలమటించేవారు తక్కువ. అలాంటి వారికి సైతం ఆయన రూ 2 కిలో బియ్యం ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తున్నారు నిజంగా వైయస్ అభినందియడని ప్రశంసలు కురిపించారు.
Hospital for training the Mentally Challenged
There are several hospitals for the treatment of the disabled which offer the convenience of replacing limbs when lost. However, hospitals which can equip intellectually challenged children with needed life skills are lacking. The present medical establishments for such children may admit the child for treatment, but may not rehabilitate or train them. In such places, even admission may be limited to a fifteen day period and not on a long term basis. Such hospitals again, can only take in a few such children, even though they try their best.
Upon admission to the hospital, treatment for the children with intellectual disabilities ideally must involve equipping them with education or self sustenance skills, instead of mere admission. The service involving training such children has provided the nurses (including male nurses) with a job opportunity, for which they charge a fee.
Given these state of affairs, a Centre was designed to provide a permanent solution for the intellectually disabled. This hospital would not just treat the children but also train the caregivers who would then be fairly equipped to train such children. The caregivers would even extend their services beyond the hospital, by traveling to the surrounding villages to offer support to the needy. The affected families would then not need to travel all the way to the hospital for the child’s treatment. The caregivers are also appropriately compensated for their efforts creating an employment opportunity for them. This concept was devised purely keeping the convenience, safety of the disabled children.
In line with the same concept, Dr. AVK, even established a three-floor building specially for handling the intellectually disabled. But securing construction space within the Niloufer Hospital premises was no mean feat. When he approached the government for permission, they asked if he could build 35 schools in return for permission for the hospital construction. Undaunted, he completed the schools as well as the building with 15 rooms for the purpose. Prior to this hospital, in 1990, he had constructed a hospital in his parents’ name in Jadcherla. Currently, the government has taken over this hospital.
Soon after, Dr. AVK was moved by the plight of cotton farmers in Jadcherla area and donated his land for the construction of a market yard for their benefit. This market yard was named after his parents (Sri Purnachandra Rao, and Smt Nancharamma) and their statues were duly erected there. The market yard has greatly benefited farmers in Mahbubnagar district as well as nearby regions. From the success of the market yard, the impact created by Dr. AVKs visionary endeavours is evident.
Serving as the District Governor of Lions Club, Dr. AVK has established schools, bus shelters, and hospitals, along with ambulance services, benefiting the public in the region. Vijay Kumar’s services have been remarkable, with him organizing blood donation camps, collecting 20 units of blood in a single day in 1997. Such service programs have since been going on tirelessly.