Diverse service initiatives – by Lion Vijay Kumar

విరవిగా సేవా కార్యక్రమాలు – లయన్ విజయ్ కుమార్

భారతదేశంలోని పేదరికాన్ని పూర్తిగా రూపుమాపలేనప్పటికీ, ఎవరికి వారు తమ వంతు సహాయాన్ని అందిస్తే కొంతవరకు లేని వాడికి ఊరట కలుగుతుందనే అభిప్రాయంతో స్వచ్ఛంద సంస్థలెన్నో పనిచేస్తున్నాయి. ఇదే ఆశయంతో 1917లో ఎక్కడో ప్రారంభమైన లయన్స్ క్లబ్ కూడా అంచలంచెలుగా వేళ్ళునుకొని నేడొకవట వృక్షంగా మారి ఎందరో ఆపన్నులకు అభయ హస్తాన్ని అందిస్తూ తోడ్పడుతోంది. అయితే ఈ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు కొందరు వ్యక్తుల ఉత్సాహం, చొరవ కారణంగా మరింత విస్తరించుకుని ఎందరికో దిక్సూచిగా మారి, ఆపన్నులకు తామన్నామనే భావనను కలిగించింది. ఇలాంటి కోవలోకి వస్తారు అరికపూడి విజయ్ కుమార్. ఏనాడో కంప్యూటర్ డిగ్రీ అందుకున్నా, వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని పది మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో తొలుత కాంట్రాక్టర్గా మారి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి, తద్వారా జడ్చర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అయ్యారు. తర్వాత హైదరాబాదుకు వచ్చి లయన్స్ క్లబ్ లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకోవడంతోపాటు డిస్ట్రిక్ట్ గవర్నర్, ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు. ఈ క్రమంలో ఆయన రక్త దానాలు, నేత్రదానాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లాంటి వెన్నో చేయించారు. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారికి ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఇతర ఉచిత వైద్య శిబిరాలు లాంటివి ఎన్నో క్లబ్ తరఫున చేయించారు. చివరకు రాజపూర్ గ్రామంలో తన తల్లితండ్రులు నాంచారమ్మ, పూర్ణచంద్రరావు పేరుమీద కట్టించిన ఆసుపత్రిని సైతం పేదల కోసమని ప్రభుత్వానికి అప్పగించేశారు. ప్రతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించి ఎందరినో ఆదుకోవడానికి తన వంతు సాయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండే విజయ్ కుమార్ మానసిక వికలాంగులకై నిలోఫర్ లో 35 లక్షల రూపాయలతో నిర్మించిన శిక్షణ కేంద్రాన్ని ఒక ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. హైదరాబాదులో మానసిక వికలాంగుల శిక్షణ ఇచ్చే సౌకర్యం నీలోఫర్లో మాత్రమే ఉంది. కానీ దీనివల్ల ఎక్కువ మందికి ఉపయోగం కలగడం లేదని భావించి ఈ భారీ కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ శిక్షణ పొందే శిక్షకులకు ఒక్కొక్కరికి ఐదు నుంచి పదిమంది పిల్లల కేసులను అప్పగించినట్లయితే అవసరాన్ని బట్టి వారు ఆయా గ్రామాలకు వెళ్లి పిల్లలకు శిక్షణ ఇవ్వడంతో పాటు తమ పనులు తామే చేసుకునేలా తీర్చిదిద్దుతారని అనుకొని దీనికి రూపకల్పన చేశామన్నారు. ఇందుకోసం స్థలం అడిగినప్పుడు నవోదయ కింద 35 పాఠశాలలు నిర్మిస్తేనే ఇస్తామని ఆ నాటి కలెక్టర్ స్పష్టం చేశారు. దాంతో శిక్షణా కేంద్రాన్ని ఏ విధంగా నిర్మించాలని ఒక పట్టుదలతో ఆ స్కూళ్లను అతి కష్టం మీద పూర్తి చేయించినట్లు చెప్పారు. తర్వాత కలెక్టర్ స్థలం ఇవ్వగానే ఈ శిక్షణ కేంద్రాన్ని నాలుగు అంతస్థులతో నిర్మించామన్నారు. భవిష్యత్తులో తాను మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నట్లు విజయకుమార్ స్పష్టం చేశారు. 60 ఏళ్ల ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే పలు రక్తదాన శిబిరాలను నిర్వహించామని తెలిపారు.


Lionavk with Chandrababu naidu

Diverse Service Initiatives – The Remarkable Journey of Lion Vijay Kumar

While it’s acknowledged that poverty in India cannot be entirely eliminated, numerous charitable organizations are dedicated to the idea that their assistance can alleviate the plight of the less fortunate, at least to some extent. Among these, the Lions Club stands out as a shining example. Originating around 1917 as a regional initiative, it gradually expanded its influence, much like a nurturing tree, offering a helping hand to countless underprivileged individuals.
 
Nevertheless, it’s the passion and drive of certain individuals that have propelled these Lions Club programs, transforming them into a guiding light for many, instilling a sense of belonging among people. One such transformational figure is Mr. Arikapudi Vijay Kumar. Despite holding a computer science degree, he willingly left his job to dedicate himself to the cause of providing livelihoods for the less fortunate. He embarked on numerous service programs with the aim of infusing purpose into the lives of many. Transforming into a contractor, he assumed the role of President within the Lions Club in Jadcherla, which enabled him to reach out to these communities.
Upon relocating to Hyderabad, he assumed significant positions within the Lions Club, including District Governor and Vice President. Through these roles, he orchestrated various initiatives such as blood donation drives, eye donation campaigns, and family planning operations. Moreover, the club organized free medical camps and open-heart surgeries for those afflicted by heart diseases. Finally, in a noble gesture, the hospital erected in honor of his parents, Nancharamma and Purnachandra Rao, in Rajpur village, was handed over to the government for the benefit of the underprivileged.
 
Vijay Kumar consistently leads the way in helping others, viewing every program as a social movement. He highlighted the unique character of the training center constructed at Niloufar, worth 35 lakh rupees, specifically for individuals with mental challenges. Niloufar stands as the sole facility in Hyderabad offering training for the mentally challenged. Recognizing that this approach might not benefit a larger demographic, he took the initiative to establish this substantial center. The concept was simple: if trainers, educated here, were assigned cases involving five to ten children each, they could return to their respective villages, not only training the children but also equipping them with the skills to become self-sufficient.
 
When land was sought for this purpose, the district collector stipulated that it would only be allocated if 35 schools were constructed under Navodaya. Undeterred by the challenge, he persevered, successfully building those schools to establish the training center. Subsequently, when the collector allocated the land, a four-story training center was erected. Vijayakumar made it clear that he envisions many more programs in the future. Notably, in celebration of the 60th Independence Day, numerous blood donation camps were organized, as per tradition.”